మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దామరగిద్ద మండలం పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీశ్రీశ్రీ పోతురాజు స్వామి ఆలయానికి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సాయి ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ ప్రోపరేటర్ రుద్రా రెడ్డి మంగళవారం రోజు సందర్శించి కంచు లోహపు గుడి గంటను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణపేట జిల్లాలో ఎక్కడలేని విధంగా శ్రీశ్రీశ్రీ పోతురాజు స్వామి ఆలయం పూర్తిగా రాతితో నిర్మిస్తున్న ఆలయం ఇంత పెద్ద ఎత్తున కేవలం అన్నాసాగర్ గ్రామంలో నిర్మిస్తున్న గ్రామ ప్రజలకు పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుడిగంట దాతకు గ్రామ ప్రజలు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మెన్స్ రైట్స్ అసోసియేషన్ ఫౌండర్ మోహన్ రాజ్ అనంతయ్య గౌడ్ మాజీ ఎంపిటిసి మల్లేష్, మాజీ సర్పంచ్ రాములు, శ్రీదర్, కుర్వ శివ శంకర్, గోవింద్ గౌడ్ అంజయ్య గౌడ్, వెంకట్రాములు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.