వరికుంటపాడు:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
మూడురోజులుగా విచారణకు హాజరవుతూ, ఈరోజు పోలీసుల సమక్షంలోనే కుప్పకూలిన టీడీపీ నాయకుడు షేక్ పీరయ్య గుండె నొప్పితో ఆసుపత్రికి తరలించబడ్డ ఘటనపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గారు స్పందించారు.గొప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును వినడం అవసరమని, ప్రజల అభిప్రాయాల్ని తెలియజేసే నాయకులను అనవసరమైన మానసిక ఒత్తిడికి గురిచేయడం బాధాకరమని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆకాంక్షించారు.గ్రామమే ముద్దు మైనింగ్ వద్దు" అనే నినాదంతో ప్రజల తరఫున నిలిచిన పీరయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటనే ప్రత్యేక వైద్య సదుపాయాలకు తరలించాలని, వారికి పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం చూస్తుందన్నారు.