మన న్యూస్, ఇందుకూరుపేట ,ఆగస్టు 4: నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం, జగదేవిపేట లో కమ్యూనిటీ హాల్ నందు ఆగస్టు 4 వ తేదీ సోమవారం నుండి ఆగస్టు 10 వరకు స్వర్గీయ తిక్కవరపు రామచంద్ర రెడ్డి , దేవసేనమ్మ జ్ఞాపకార్థం తిక్కవరపు దీప్తి, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల ,చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి పొర చికిత్స శిబిరం నిర్వహించుచున్నారు.ఈ వైద్య శిబిరం నిర్వాహకులు పి. కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.......ఈ వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు రోగులకు కంటి పరీక్షలు చేస్తారు.ఈ వైద్య శిబిరానికి వచ్చు రోగులు బీపీ ,షుగర్, ఇతర వ్యాధులు ఉన్నవారు కంటి చికిత్సకు వచ్చేటప్పుడు వారు వాడే మందులు తప్పనిసరిగా తెలుసుకుని రావలెను అని అన్నారు . కంటి చికిత్స జరిగిన తర్వాత రెండు గంటలలో ఇంటికి వెళ్ళవచ్చును అని తెలిపారు. కంటి చికిత్స నూతన పద్ధతిలో (మైక్రోస్కోపిక్ స్మాల్ ఇన్ఫెక్షన్) చేయబడును అని అన్నారు. కంటి చికిత్సకు వచ్చిన వారికి ఆపరేషన్ ,ఐ ఓఎల్ లెన్స్ మరియు కంటి అద్దాలు మరియు మందులు ఉచితంగా ఇవ్వబడును అని తెలిపారు. ఈ చికిత్సకు ఎటువంటి డబ్బు చెల్లించ అవసరం లేదు. పూర్తి గా ఉచితం అని తెలియజేశారు. చికిత్సకు వచ్చేవారు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావలెను ,వర్షం వచ్చినా కూడా కంటి చికిత్స జరుగుతుంది అని తెలియజేశారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రిందికి ఫోన్ నెంబర్లు సంప్రదించగలరు 735846 3308 ;9840087 389; 8668147829.కంటి శుక్లo( పొర) గల వారికి మాత్రమే కంటి శుక్ల0 (పొర) ఆపరేషన్ చేయబడును. కంటి ఆపరేషన్ తేదీలు ఆగస్టు 8 శుక్రవారం నుండి ఆగస్టు 12 మంగళవారం వరకు జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కంటి వైద్య శిబిరానికి మొదటి రోజు మొదటి రోజు ఆగస్టు 4వ తేదీ సోమవారం 200 మంది వచ్చి కంటి వైద్య పరీక్షలు చేసుకున్నారు . అవసరమైన వారికి కంటి ఆపరేషన్ చేయబడును అని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఇందుకూరుపేట మండలం వాసులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో శంకర్ నేత్రాలయ డాక్టర్స్, సిబ్బంది, పి .కార్తీక్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.