మన న్యూస్ సాలూరు ఆగస్టు 4 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పాలన కాలంలో రైతులకు రైతు రుణమాఫీ పేరుతో ఏ విధంగా మోసం చేశాడో, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు మరోసారి మోసం చేసిన మోసకారి చంద్రబాబునాయుడు అని మాజీ డిప్యూటీ సీఎం పి రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో నాలుగు ఐదు వార్డులలో బాబు శరిటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో పి .రాజన్న దొర పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలన కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి ఏవిధంగా పెద్దపీట వేశారు వివరిస్తూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా మోసగించారో ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా వివరించారు. సూపర్ సిక్స్ పేరుతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలోని 143 హామీలు ఇచ్చినప్పటికీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మరోసారి చంద్రబాబు నాయుడు మాటలకు ప్రజలందరూ మోసపోవద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.