మన న్యూస్, తిరుపతి:
జీ.వో. నెం: 26 అమలకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు అంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం విజ్ఞప్తి చేశారు. సోమవారం రేణిగుంట విమానాశ్రయం లో మంత్రి ని కలసి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం 1996లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26ను విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో బార్బర్ పోస్టులు భర్తీ చేయడం వల్ల నాయి బ్రాహ్మణులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.