గూడూరు, మన న్యూస్ :- స్మార్ట్ మీటర్లు ను రద్దు చేయాలని కోరుతూ గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లోని 7 వ వార్డు లో సి.పి.ఎం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి జోగి శివ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు స్మార్ట్ మీటర్లు వల్ల విద్యుత్ బిల్లులు భారంగా మారాయి అన్నారు. అదానికి కోట్లు కూడపెట్టేందుకే స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపక్షం ఉన్న టిడిపి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసి నేడు స్మార్ట్ మీటర్లు బిగించడం పై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అన్నారు. స్మార్ట్ మీటర్లు బిగింపు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఆగస్టు 11 వ తేదీ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నా ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం నాయకులు పుట్టా శంకరయ్య, టి. రామిరెడ్డి, బి.వి.రమణయ్య, ఎంబేటి చంద్రయ్య, అడపాల ప్రసాద్, బి.చంద్రయ్య, చంద్ర మోహన్, గండి కోట మధు, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.