హోమం నిర్వహి స్తున్న జమీందారు వంశస్థులు.
బంగారుపాళ్యం ఆగస్టు 4 మన న్యూస్ :- బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో సోమవారం ఉదయం మహాభారత యజ్ఞం వైభవంగా ప్రారంభం అయినది.ఈ కార్యక్రమానికి ఉభయ దారులుగా జమీందారీ వారసులు ఆర్.ఎన్.జ్యోతినాథ్,ఆర్.ఎన్. నాగేంద్రబాబు ఆర్ ఎల్ మురళీమోహన్ లు వ్యవహరించారు.సోమవారం ఉదయం వీరి స్వగృహం నుండి మేళతాళాలతో ఊరేగింపుగా ధర్మరాజు సమేత ద్రౌపది అమ్మవార్లకు పట్టు వస్త్రాలను తీసుకువచ్చి సమర్పించారు.అనంతరం గణపతి పూజ,నవగ్రహ పూజ, హోమాధులను నిర్వహించి మహాభారత యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈకార్యక్రమంలో మహాభారత యజ్ఞధర్మకర్త అరుణామలరెడ్డి, హేమచంద్రారెడ్డి,టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు మధుబాబు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.