కొండాపురం:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు అనుగుణంగానే శాసనసభ్యులo పనిచేస్తామని, ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తెలిపారు.సోమవారం కొండాపురం మండలంలోని పొట్టి పల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం మార్గాలను చూపారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వరికుంటపాడు మండలం లోని వరికుంటపాడు పంచాయతీ లో ఉన్న జంగం రెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో గత వైసిపి ప్రభుత్వం లోనే అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ రోజు నుండి నేటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్న వరికుంటపాడు వైసిపి సర్పంచ్, నాడు అనుమతులు ఇస్తుంటే చూస్తూ ఉన్నారని,నేడు దానిని రాజకీయంచేస్తున్నారన్నారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన సర్పంచ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి, నేడు అమాయకులను, అడ్డం పెట్టుకొని, కొంతమంది రాజకీయ నాయకులతో చేయి కలిపి, రాద్ధాంతం చేస్తున్నారన్నారు.ఆ రోజే అనుమతులు అడ్డుకొని ఉంటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదన్నారు. లీగల్ గా అనుమతులు తెచ్చుకున్న తర్వాత, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుందన్నారు. అధికార యంత్రాంగం గ్రామంలో ప్రజా వేదిక నిర్వహించిందని ఆ రోజు నుండి అలజడి సృష్టిస్తున్నారన్నారు. ఆ గ్రామం పక్కన మైనింగ్ పనులు ఎక్కడా జరగడం లేదని తెలిపారు. గత వారం రోజుల క్రితం గ్రామ పర్యటనలో ఉన్నప్పుడు నా దృష్టికి ఈ సమస్య తీసుకురాగా, చట్టవ్యతిరేకంగా ఎక్కడైనా మైనింగ్ జరుగుతుంటే చర్యలు చేపట్టవలసినదిగా అధికారులకు సూచించామన్నారు.హైవేపై రాస్తారోకో చేయకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారన్నారు. అందులో భాగంగా పోలీసులు విచారిస్తున్న సమయంలో టిడిపి కార్యకర్త ఎస్.కె పిరయ్య కుప్పకూలారు అన్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారని ఆ విషయాన్ని ఫోన్ ద్వారా వారి కుమారుడిని అడిగి తెలుసుకున్నానని తెలిపారు. వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎస్.కె పిరయ్య త్వరగా కోలుకొని ఆకాంక్షించారు. లీగల్ గా చేసుకునే పనులకు నేను అడ్డు కాదని ఇల్లీగల్ పనులు చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడను అన్నారు. కనుక సమస్యలను కొని తెచ్చుకోకుండా, సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటానన్నారు.
ఈ కార్యక్రమంలో కొండాపురం మండలం మరియు గ్రామ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలు, తదితరులు ఉన్నారు.