గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలల దందా ఎలా ఉంది అంటే నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ప్రైవేటు పాఠశాలలు ఫైసా వసూలు అంతా ఇంతా కాదు పిల్లలు వేసుకునే బట్టలు వాళ్ల స్కూల్లోనే కొనాలి, పాఠశాల యాజమాన్యం 300 రూపాయలు పడే డ్రెస్సులను 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు, ఒక తరగతి పుస్తకాలని 5000-15000 రూపాయల వరకు అమ్ముతున్నారు. మరియు షూ, బ్యాగులను కూడా వారికి నచ్చిన ధరను నిర్ణయించి పిల్లల దగ్గర దోపిడీ చేస్తున్నారు. ఇవన్నీ గుట్టుగా పిల్లల పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని పుస్తకాలకు డ్రెస్సులకు ఒక చీటీ వ్రాసి ఇస్తారు. పక్కనే ఒక షాప్ అద్దెకి తీసుకొని వాళ్లకు సంబంధించిన వ్యక్తిని అక్కడ పెట్టి ఈ చీటీ ఇచ్చిన వారికి పుస్తకాలు డ్రస్సులు ఇస్తారు, ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఆ పుస్తకాలు అమ్ముతున్నారు. అదేంటి అని అడిగితే మేము కాదు వేరే వాళ్ళవి అని చెప్తున్నారు, ఇది ఏమిటని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెపుతున్నారు. నర్సరీ పిల్లలకు పాఠశాల ఆదాయం కోసం చదవలేని పుస్తకాలను మోయలేని పుస్తకాలు కొనాలని ఒత్తిడి పెంచుతున్నారు. చదువులు చెప్పుటకు అర్హత లేని వారిని తీసుకుని తక్కువ జీతాలు ఇచ్చి పిల్లల దగ్గర ఎక్కువ ఫీజులు తీసుకుని చదువులు చెప్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులకు తక్కువ జీతం ఇచ్చి అనుభవం లేని డ్రైవర్ లను పెట్టి తిప్పుతున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలో అయితే వాష్ రూమ్స్ ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా లేవు. ఈ ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న మోసాల గురించి మా దగ్గర ప్రతి ప్రైవేటు పాఠశాల చిట్టా మా దగ్గర ఉంది. చదువు పేరు చెప్పి ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న అక్రమాల చిట్టాను ఒక నివేదిక రూపంలో ఎంఈఓ ఇస్తున్నాము. ఎంఈఓ మీరు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పుస్తకాలు డ్రెస్సులు అమ్ముతున్నారు. అలాంటి పాఠశాలలను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. లేని పక్షంలో కలెక్టర్ ప్రతి ప్రైవేటు పాఠశాల పూర్తి నివేదికను అందజేస్తామని తెలియజేస్తున్నాము. ప్రైవేటు పాఠశాలలు తీరు ఇప్పటికైన మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఎబివిపి ఆధ్వర్యంలో పాఠశాలల ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్ , పట్టణ ప్రధాన కార్యదర్శి బోయ వెంకటేశ్వర్లు , ఓబీసీ మోర్చ మండల అధ్యక్షుడు అయ్యరాజు , జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ , శేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.