మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-4:- చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవనంపల్లె పోలీస్ స్టేషన్ నందు వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 6వ తేదీన వేలం వేయడం జరుగుతుందని తవణంపల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ ఎక్సైజ్ కేసులో పట్టుబడిన ఒక ఈచర్ లారీ, ఒక కారు, ఏడు మోటార్ వాహనాలను చిత్తూరు జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ కృష్ణ కిషోర్ వారి ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ వేలంలో పాల్గొనదలచిన వ్యక్తులు తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు అదే రోజు ఉదయం 10 గంటలకు సంబంధించిన రుసుమును చెల్లించి వేలంలో పాల్గొనాలని వివరించారు. పూర్తి వివరాలకు తవణంపల్లె పోలీస్ స్టేషన్ నందు సంప్రదించాలని తెలియజేశారు.