శంఖవరం మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 04:- రవాణా వాహనదారులకు కూటమి ప్రభుత్వం గ్రీన్ టాక్స్ భారాన్ని తగ్గించడంతో రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షుడు వెన్నా శివ ఆధ్వర్యంలో కత్తిపూడి లారీ యూనియన్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,యువ నేత నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,కత్తిపూడిలో లారీ యూనియన్ ఆఫీస్ వద్ద యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు గౌతు కన్నారావు,గౌతు అర్జబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్యఅతిథిగా హాజరవ్వగా యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే సత్యప్రభని ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా లారీ యూనియన్ సభ్యుల సమస్యలను వెన్నా శివ ఎమ్మెల్యే సత్యప్రభకి తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రీన్ టాక్స్ రద్దు చేస్తానన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా చేయూతనిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం,సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు.గ్రీన్ టాక్స్ రద్దు ద్వారా లారీ యజమానుల కుటుంబాలకు ఆర్ధికంగా మేలు జరుగుతుందని అన్నారు.లారీ యూనియన్ సభ్యుల అభ్యర్థన మేరకు వారికి అనువైన స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షులు దుగ్గిన రాజబాబు,కత్తిపూడి యూనియన్ గౌరవాధ్యక్షులు గౌతు నాగు,శెట్టి అశోక్ మూర్తి,కూటమి నేతలు యాళ్ల జగదీష్,బద్ది రామారావు, గాబు కృష్ణమూర్తి,కీర్తి శుభాష్,ఇళ్ల అప్పారావు,సాధనాల లక్ష్మీ బాబు,కరణం సుబ్రహ్మణ్యం, బొమ్మిడి సత్తిబాబు,పలివెల సతీష్ తదితర కూటమి నేతలు హాజరయ్యారు.