కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
అక్క చెల్లెమ్మ లు ఆగస్టు 15 నుండి స్త్రీశక్తి పథకం అమలవుతుందని, ఈ పథకాన్ని ఆడపడుచులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు.ఆదివారం కలిగిరి మండలం ఎరుకల రెడ్డి పాలెం గ్రామం లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మండలం మరియు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వ తాతలను,ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ లు, అన్నదాత సుఖీభవ, పథకాల గురించి ఆరా తీశారు. అన్ని పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన అందిస్తున్నారని మహిళలు అవ్వ తాత లు అన్నదమ్ములు ఆనందం వ్యక్తం చేశారు. ఇల్లు లేని నిరుపేదలు, స్థానిక సచివాలయంలో, అర్జీలు అందజేసి అప్లై చేసుకోవాలన్నారు. హౌసింగ్ ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. స్థలం లేని వారికి కూడా రెవెన్యూ అధికారులు స్థలాన్ని మంజూరు చేస్తారని తెలిపారు. పి- 4 విధానంలో, నాలుగు బంగారు కుటుంబాలను దత్తకు తీసుకుంటానని ఆ గ్రామానికి చెందిన షేక్ ఖాజా మస్తాన్ తెలియజేయగా ఆయనను ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందించారు. ఇటువంటి దాతలు ఇంకా ముందుకు రావాలని బంగారు కుటుంబాలను దత్తకు తీసుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేదరికం నుండి బయట పడాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు, రావుల కొల్లు సర్పంచ్ పీవీ నాయుడు, చేవూరు జనార్దన్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, గ్రామ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.