మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం అని సీడీపీఓ సౌభాగ్య అన్నారు. శనివారం మహమ్మద్‌నగర్ మండలంలోని తెల్గాపూర్, సింగీతం,షేర్ఖాన్పల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల హాజరు, పౌష్టికాహార మెనూ తదితరాలను పరిశీలించారు. అనంతరం పాల్గొన్న బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యతను వివరించారు.ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా
సీడీపీఓ మాట్లాడుతూ – "పుట్టిన వెంటనే తల్లులు ముర్రు పాలను బిడ్డకు ఇవ్వాలి. ఇది బిడ్డ ఆరోగ్యానికి తొలి టీకా లాంటిది. ముర్రుపాలలో యాంటీబాడీలు అధికంగా ఉండటంతో, బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేగాక, తల్లిపాల వల్ల బిడ్డ ఎదుగుదల సరిగా జరుగుతుంది. వేడి, దగ్గు, డయేరియా లాంటి సంక్రమణల బారిన పడకుండా ఉంటారు.తల్లిపాల వల్ల కలిగే లాభాలు తల్లిపాలు పూర్తిగా పౌష్టికతతో నిండిన ప్రకృతి ప్రసాదం.ఇందులో అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమపాళ్లలో ఉంటాయి.తల్లిపాలు తాగే పిల్లలకు మానసికాభివృద్ధి వేగంగా జరుగుతుంది.
చిన్ననాటి నుంచి తల్లిపాలు తాగిన పిల్లలకు భవిష్యత్‌లో మధుమేహం,ఊబకాయం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. తల్లిపాలు తాగే శిశువుల మృతిదర శాతం గణనీయంగా తగ్గుతుంది.
అంగన్వాడీ సేవల వినియోగం తప్పనిసరి
ప్రతి గర్భిణీ మూడు నెలల లోపు అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రసవం తరువాత కనీసం ఆరు నెలల వరకు కేంద్రం ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. బిడ్డ పుట్టిన వెంటనే బీసీజీ ఇంజెక్షన్ వేయించుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరి,అంగన్వాడీ కార్యకర్తలు గంగామణి,స్వప్న, కిష్టమ్మ,సాయవ్వ,గర్భిణీలు, బాలింతలు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.