గూడూరు, మన న్యూస్ :- శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపికల ఫలితాలలో గూడూరుకు చెందిన విద్యార్థి సత్తా చాటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం నలజాలమ్మ వీధి ప్రాంతానికి చెందిన చలమత్తూరు ఈశ్వర్ శుక్రవారం విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ఫలితాల్లో జిల్లా స్థాయిలో 8వ ర్యాంక్, బి సి ఏ కేటగిరీలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటారు. గతంలో ఎస్సై సివిల్స్ గ్రూప్-2 ఉద్యోగాలు చేజారినప్పటికీ పట్టు వదలకుండా పోరాడి చదివి కానిస్టేబుల్ ఎంపికల్లో ర్యాంకును సాధించారు. దీంతో తన ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేరడంతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది.