మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో బీసీ హాస్టల్ లో 14మంది విద్యార్థులకు గాను 6 మంది సుదీర్ఘ సెలవులో ఉండగా మిగతా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక వార్డెన్, అటెండర్, కుక్, నైట్ వాచ్మెన్ నియామకం చూసి పాచిపెంట మండల స్పెషల్ ఆఫీసర్ రాదాకృష్ణ,ఎంపీడీవో బీజే పాత్రో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు స్పెషల్ ఆఫీసర్ రాధాకృష్ణ పి కోనవలస ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ లో రికార్డులు తనిఖీ చేసిన అనంతరం పాచిపెంట బీసీ బాలుర వసతి గృహానికి తనిఖీ నిమిత్తం విచ్చేశారు. తనిఖీలు పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 2022 సంవత్సరం నుంచి 14 మంది విద్యార్థులతో హాస్టల్ నడుపుతున్నట్టు తెలిసింది. ఈ విద్యా సంవత్సరానికి 8 మంది విద్యార్థులు హాస్టల్ కు హాజరు కావడంతో ప్రభుత్వం వారికోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. 50 లక్షలు విలువ చేసే భవన సముదాయము, ఒక వార్డెన్,నైట్ వాచ్మెన్, అటెండర్,వంట కుక్ ఉన్నారు. సుమారు నాలుగు సంవత్సరాల నుంచి హాస్టల్ దుస్థితి చూస్తే ఇంత అద్వానంగా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. కనీసం హాస్టల్లో ఇంత తక్కువ మందితో నడిపించడం ఎంతవరకు సమంజసమని సంబంధిత జిల్లా అధికారులు కూడా దీనిపై పట్టించుకోకపోవడం గమనార్హం. లక్షల ఐదు రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఇంత చిన్న విషయం ఎందుకు బయటపడలేదో అర్థం కావడం లేదు. శుక్రవారం నాడు స్పెషలాఫీసురు ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తేవాస్తవం తెలిసింది. హాస్టల్ సిబ్బంది మండల అధికారులు కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పిల్లలను హాస్టల్లో చేర్చే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సంబంధిత అధికారులు కోరుతున్నారు. ఎనిమిది మందితో హాస్టల్ నడిపించడం మాకే చాలా ఇబ్బందిగా ఉందని మీరు ఇన్నాళ్లుగా పనిచేస్తున్నా మీకు ఎటువంటి బాధ లేకపోవడం గమనించదగ్గ విషయమని ఆయన మండిపడ్డారు. 100 మంది పిల్లల వరకు హాస్టల్లో చేర్పించే విధంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ పిల్లల్ని చేర్పించేవారు లేక హాస్టలు ఈ దుస్థితికి చేరుకుంది. విద్యార్థులను చేర్పించడానికి తాను కృషి చేస్తున్నానని ఇన్చార్జి వార్డిను స్పెషల్ ఆఫీసర్ బృందానికి సమాధానం ఇచ్చారు. ఏది ఏమైనా ఇకపై హాస్టల్లో విద్యార్థులు చేర్పించడానికి మండల అధికారులతో పాటు తాను కూడా భాగస్వామిని అవుతానని తన వంతు కృషి చేస్తానని స్పెషల్ ఆఫీసర్ రాధాకృష్ణ హాస్టల్ వార్డినికి తెలియజేశారు.హాస్టల్ సిబ్బంది స్థానికంగా ఉండాలని, మెనూ సక్రమంగా పాటించాలని పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు.