మన న్యూస్,తిరుపతి :- నెల్లూరు పర్యటనకు వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట చినబాబు డిమాండ్ చేశారు. టిడిపి నగర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వట్టికుంట చినబాబు మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్న అరాచకాలను ప్రజలంతా గమనిస్తున్నారని, 151 అసెంబ్లీ సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేసిన ఇంకా బుద్ధి రాలేదన్నారు. ప్రభుత్వ భూముల్ని ఆస్తుల్ని దోచేస్తున్న వ్యక్తి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో పరామర్శించేందుకు జగన్ రెడ్డి రావటం సిగ్గుచేటు అన్నారు. మనదేశంలో స్త్రీని దేవత మూర్తిగా భావించే ఈ సమాజంలో ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని ప్రసన్న కుమార్ రెడ్డి అవమానపరిచిన వ్యక్తిని పరామర్శించేందుకు రావటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి సహనం కోల్పోయి ఏమి మాట్లాడుతున్నాడో తెలియక నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పట్ల లేనిపోని మాటలు మాట్లాడడం సమంజసంగా లేదన్నారు. ఇటువంటి వ్యక్తి జగన్ రెడ్డి మన రాష్ట్రంలో ఉండటం అవసరమా అని ప్రశ్నించారు. ప్రపంచమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మెచ్చుకుంటున్నారని, కక్షలు, కార్పన్యాలను ప్రోత్సహించకుండా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. జగన్ రెడ్డి పై ఇప్పటికే 11 కేసులు 11 కోర్టులో తిరగాల్సిన పరిస్థితి నెలకొందని మరో పదకొండు రోజుల్లో అరెస్టు అయ్యే అవకాశం ఉందన్నారు. విశాఖ ప్రజలు జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మిని ఓడించి ఇంటి బాట పట్టించారన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ మంగళగిరిలో ఓటమిపాలైనప్పటికీ అక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది మంగళగిరిని అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర పని చేసిన వాళ్లంతా జైలుకు పోతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. జగన్ రెడ్డి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబుపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించాలని టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు హితవు పలికారు.