గూడూరు, మన న్యూస్ :- రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా మంజూరైన లక్షా తొమ్మిది వేల స్పౌస్ వితంతు పెన్షన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల ప్రకారం నేడు గూడూరు 2వ పట్టణంలోని 20, 21 సచివాలయాల పరిధి లోని నర్సింగ్ రావు పేట, బి.సి.కాలనీ, ఎస్.ఆర్.ఎ. టాకీస్ ప్రాంతాలలో 4వ క్లస్టర్ కో కన్వీనర్ అరికట్ల మస్తాన్ నాయుడు, 18వ యూనిట్ ఇన్ ఛార్జ్ ఎం.డి. అబ్దుల్ రహీం, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పరమేశ్వర గౌడ్, కేశవర్దన్ నాయుడు, శంకర్ నాయుడు, గుండాల శ్రీదేవి,సరస్వతమ్మ, పర్వీన్, అశోక్ గౌడ్,కిషోర్ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పింఛన్లను భర్త చనిపోతే తిరిగి భార్యలకు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను పెంచడమే కాకుండా భర్త చనిపోయిన వితంతువులకి పింఛన్లను మంజూరు చేసి వారిని ఆదుకోవడం జరిగిందన్నారు.