మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ ,పీఆర్టీయూ మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలాల నూతన కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు.మహమ్మద్ నగర్ మండలాధ్యక్షుడిగా నారాయణ, ప్రధాన కార్యదర్శిగా వెంకట్ రాం రెడ్డి ఎన్నికయ్యారు. నిజాంసాగర్ మండలాధ్యక్షుడిగా సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సురేందర్ ఎన్నిక కాగా, జిల్లా అధ్యక్షుడు కుషాల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో అమర్ సింగ్, కాంప్లెక్స్ హెచ్ఎం రాంచందర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రమణ, భాస్కర్ గౌడ్, నరహరి, రాష్ట్ర కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు జనార్దన్, బాన్సువాడ మండల రూరల్ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.