కొండాపురం,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
కొండాపురం మండలం కొమ్మి గ్రామపంచాయతీ రామానుజాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకుల మాలకొండయ్య గారు గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా ఈరోజు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు గారు ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య సమస్యలను తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పినారు. అనారోగ్యంతో బాధపడుతున్న మారకొండయ్య మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గారిని చూడగానే ఆనందంతో మంచం మీద నుండి లేచి కూర్చొని గతంలో జరిగిన రాజకీయ విషయాలను చర్చించినారు. ఈ సందర్భంగా మాలకొండయ్య బొల్లినేని నీ బస్టాండ్ దగ్గర కట్టిన ఆర్చి కి రంగులు వేయించవలసినదిగా కోరినారు. నీ కోరిక నెరవేర్చుతారని ఆ రంగులకు ఎంత ఖర్చు అయితే అంత నేను భరిస్తానని తెలిపినారు. అక్కడికి వచ్చిన రామానుజాపురం గ్రామస్తులు బొల్లినేని వెంకట రామారావు గారికి అభినందనలు తెలిపినారు.