మన న్యూస్,తిరుపతి :- ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ప్రవేట్ బస్సుల కోసం ప్రవేట్ బస్టాండు కు స్థలం కేటాయించాలని ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా ప్రవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు రూపేష్, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు కమల్, ప్రధాన కార్యదర్శి భాషా, కోశాధికారి మల్లికార్జున, కార్యదర్శి మురళి ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కన్వీనర్ ముని రాజా యాదవ్, అధ్యక్షులు రూపేష్ లు మాట్లాడుతూ ప్రతిరోజు తిరుపతికి వందలాది ప్రైవేట్ బస్సులు రాకపోకలు కొనసాగిస్తుంటాయని, అయితే ప్రయాణికులు దిగడానికి ఎక్కడానికి బస్టాండ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున కూటమి ప్రభుత్వం తమ అసోసియేషన్ అభ్యర్థనను మన్నించి వీలైనంత త్వరగా ప్రైవేట్ బస్సుల బస్టాండ్ కోసం స్థలం కేటాయిస్తే ప్రయాణికులకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. అందుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తమ విన్నపాన్ని సానుకూలంగా స్పందించారని, త్వరలో కార్పొరేషన్ అధికారులతో చర్చించి ప్రవేట్ బస్సుల బోర్డింగ్ కోసం స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.