గూడూరు, మన న్యూస్ :- గూడూరు SDPO పి గీతా కుమారి, గూడూరు 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు శేఖర్ బాబు, శ్రీనివాస్ లు కలిసి, గూడూరు పట్టణ పరిధిలోని వివిధ బ్యాంక్స్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బ్యాంకు సిబ్బందితో చర్చల అనంతరం కొన్ని కీలక పాయింట్లు గుర్తించబడ్డాయి. సీసీ టీవీ కెమెరాలు: బ్యాంకు బయట అమర్చిన కెమెరాలు తక్కువ resolution కలిగినవిగా ఉండడం గమనించబడింది. వీటిని అధిక నాణ్యత కలిగిన కెమెరాలతో మార్చాలని సిఫారసు చేశారు
అలారం సిస్టమ్: ప్రస్తుత అలారం వ్యవస్థ కేవలం ముగ్గురికి మాత్రమే కనెక్ట్ అయి ఉంది. తక్షణ స్పందన కోసం పోలీస్ స్టేషన్‌కి కూడా అనుసంధానించాలని సూచన చేశారు. భద్రతా సిబ్బంది: కొన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద డే టైమ్‌లో గార్డులు లేకపోవడం గమనించబడింది. తగిన భద్రతా సిబ్బందిని నియమించాలని సూచన చేశారు. కస్టమర్లపై నిఘా: అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను బ్యాంకు సిబ్బంది గుర్తించి పోలీస్‌లతో కలసి పరిశీలించాలన్నారు.హాట్‌లైన్ వ్యవస్థ: బ్యాంకు మరియు స్థానిక పోలీస్ స్టేషన్ మధ్య ప్రత్యక్ష హాట్‌లైన్ ఏర్పాటుచేయాలని సూచన. అలారం వ్యవస్థలో సిబ్బంది అనుసంధానం: సంబంధిత బ్యాంకు సిబ్బంది అందరూ అలారం వ్యవస్థకు అనుసంధించబడి ఉండేలా చూడాలి. భద్రతా పరిరక్షణను బలోపేతం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ బ్యాంకులతో సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.