మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయితీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు.కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలేశ్వరంలో గొల్లలమెట్ట నందు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 92/1 లో 10 సెంట్లు భూమిని తంగేటి వీరబాబు అనే వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని,ఈ విషయాన్ని కమిషనర్ సత్యనారాయణకు తెలియజేసినా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ భూమిలో అక్రమకట్టడాలు కడుతుంటే అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేస్తూ ఉండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు.-
భవన నిర్మాణపు పనులు జరుగుతున్నా సరే నిర్మాణపు పనులు ఆపేసినట్లు హైకోర్టుకు చెప్పడం జరిగిందని,మళ్ళీ అదే కమీషనర్ డూప్లికేట్ పట్టా ఉందని కూడా కోర్టుకి చెప్పడంతో పలు అనుమానాలు ఉన్నాయన్నారు.అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ నిబంధనలను నిర్వీర్యం చేస్తున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనరుపై కోర్టు ధిక్కరణ కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నామని కొసిరెడ్డి గణేష్ అన్నారు.మహిళా నాయకురాలు గండేటి నాగమణి మాట్లాడుతూ నగర పంచాయితీలో పలుచోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు నాగులపల్లి శంకర్,గోనాపు సాయి,
వల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.