మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
ఎస్సీ వర్గీకరణ,దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్.ఎస్ రత్నాకర్ ఆరోపించారు.కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర జరుగుతుందన్నారు.ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా పంజాబ్,హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజం నాటిందని ఆరోపించారు.దీన్ని దేశం మొత్తం మీద మోడీ దళితుల్ని విభజించి పాలించాలనే దురుద్దేశంతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను అమలుకు పూనుకున్నాడని ఆరోపించారు.వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను ఎస్సీ జాబితాలో ఉన్న 1108 మంది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని మోడీని ప్రశ్నించారు.అలాగే తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలకు చంద్రబాబు,రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని,ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు.చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటుంటే మాలల హోల్సేల్ మేనమామ జగన్మోహన్రెడ్డి మాలలకు అన్యాయం జరుగుతూ ఉన్న ముద్దులతో సరిపెట్టడం తప్ప ఏనాటికి స్పందించలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయాయని,చేసేదేముందని అనుకోకుండా ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు.ఎస్సీ వర్గీకరణ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకునే వరకు శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.లేనిపక్షంలో మాల సామాజిక వర్గం భవిష్యత్తులో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్ బాబు కూచికొండ బాబు,నెల్లి సూరిబాబు, తనికెళ్ళ నాని,యమ్ముల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.