మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో పట్టణంలోని ఎల్లమ్మ కుంట జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యాంజనేయులు తెలిపారు. ప్రోగ్రాం చైర్మన్ డాక్టర్ లయన్ మణికంఠ గౌడ్, కో చైర్మన్లు లయన్ డాక్టర్ రాజేష్ గౌడ్, లయన్ డాక్టర్ అశోక్, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించి తగు జాగ్రత్తలు వివరించారు. అనంతరం వైద్య శిబిరంకు సహకరించిన డాక్టర్ తిరుపతి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్ లను శాలువా, మెమొంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా గురుకుల ప్రిన్సిపాల్ రేవతి లయన్స్ క్లబ్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి ఆడెం సత్యనారాయణ, జోన్ చైర్మన్ సూగురు జైపాల్ రెడ్డి, డాక్టర్ శ్రీరామ్, రాజుల ఆశిరెడ్డి, జాయింట్ సెక్రటరీ మామిళ్ల పృథ్వీరాజ్, సీనియర్ సభ్యులు కర్ని స్వామి, గవినోళ్ల జైపాల్ రెడ్డి, ఆంబాదాస్, రఘు ప్రసన్న భట్, కట్టా వెంకటేష్, కొండా విజయ్, శరణప్ప, వాకిటి రమేష్, భార్గవ్ రాణా, హెల్త్ సూపర్ వైజర్ నిహరిక , రాజుల ఆశి రెడ్డి విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.