ఓ రూపాయికి షేవింగ్, హెయిర్‌కట్ అన్న ముస్లిం వ్యక్తిపై తీవ్ర వ్యతిరేకతఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ సర్కిల్ లో సెలూన్ ఓపెనింగ్ కు వ్యతిరేకంగా నాయి బ్రాహ్మణ సంఘం ధర్నా పిలుపు
తిరుపతి, మన న్యూస్: తిరుపతి నగరంలో నాయి బ్రాహ్మణ సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమ వృత్తి పరంగా ఎదురవుతున్న అన్యాయాన్ని ప్రశ్నించింది. తిరుపతి నగరంలో ని ఓల్డ్ మెటర్నటీ హాస్పిటల్ సర్కిల్ వద్ద ఓ ముస్లిం వ్యక్తి "ఒక రూపాయికి హెయిర్‌కటింగ్ – ఒక రూపాయికి షేవింగ్" అంటూ బోర్డులు పెట్టి గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమవుతుండటాన్ని తీవ్రంగా ఖండించారు. నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు మాట్లాడుతూ, "ఇది మా వృత్తి మీద నేరుగా దాడి. ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు ‘చీప్ అండ్ బెస్ట్’ పేరుతో మా వృత్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. ముస్లిం వ్యక్తులు, ఇతర కులస్తులు ఈ వృత్తిలోకి రావడం వల్ల మేము శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయాలకు గౌరవం లేకుండా పోతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. "మా వృత్తిలోకి రావాలంటే కేవలం వ్యాపార ఉద్దేశంతో కాకుండా, సంప్రదాయాలను గౌరవిస్తూ, స్వయంగా ఈ నైపుణ్యాన్ని నేర్చుకొని, మా కులానికి సంబంధించి ధృవీకరణ పొందినవారు మాత్రమే కొనసాగాలి. లేకపోతే మేము దీన్ని వ్యాపార పోటీ కాదు, మాకొచ్చిన ఆర్థిక దాడిగా భావిస్తాం" అని వారు పేర్కొన్నారు. ధర్నా పిలుపు :- ఈ నేపథ్యంలో, రేపు జరగబోయే గ్రాండ్ ఓపెనింగ్‌ను అడ్డుకునే ఉద్దేశ్యంతో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఈ ధర్నా సందర్భంగా స్థానిక ప్రజల మద్దతు కూడా కోరుతున్నారు. ఇది కేవలం ఓ వ్యాపారానికి వ్యతిరేకత కాదని, తమ జీవితాధారాన్ని కాపాడుకోవడానికి చేసే న్యాయ పోరాటమని సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి విజ్ఞప్తి :- ఈ తరహా కార్యక్రమాలకు పాలుపంచుకునే సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకొని, స్థానిక సంప్రదాయ వృత్తుల భద్రతను కాపాడాలని ప్రభుత్వానికి నాయి బ్రాహ్మణ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, నాయి బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు శ్రీ జయకుమార్ ,
మాజీ అధ్యక్షులు శ్రీ శిబ్బాలా సుధాకర్, రామ్ నారాయణ, శివ, దాము, సహదేవ, ఆర్లీ బాబు, తాతారావు,
మునిరాజ , తదితరులు పాల్గొన్నారు.