కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): 31వతేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై ఆంక్షలు ఉండటంతో జన సమీకరణకు అనుమతులు లేవు…
కలిగిరి,వింజమూరు, కొండాపురం, జలదంకి మండలాల వైసీపీ నాయకులు ఎవరైనా జన సమీకరణ చేసినా…రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటున్న సీఐ వెంకటనారాయణ అదేవిదంగా
గుంపులు గుంపులుగా వెళ్లడం కానీ వాహనాలలో ర్యాలీగా వెళ్లడం కానీ చేస్తే తగు కఠిన చర్యలు తప్పవని హేచ్చరించారు. ఈ కార్యక్రమాలకి ఎలాంటి అనుమతి లేనందున పై కార్యక్రమాలు చేపట్టకూడదు అని ఆయన తెలియజేసారు. ఒక వేళ
ఎవరైనా పై నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని కలిగిరి సీఐ వెంకటనారాయణ అన్నారు.