మన న్యూస్ పాచిపెంట, జూలై 30:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పాచిపెంట పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్టు వద్ద ఆంధ్ర నుంచి ఒడిస్సా రాకపోకలు సాగిస్తున్న బస్సులు, కార్లు,లారీలు ద్విచక్ర వాహనాలను పాచిపెంట ఎస్సై వెంకట్ సురేష్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈనెల 28వ తేది నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా భద్రతా దుృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు పాచిపెంట పరిధిలో నాకాబంది, వాహనాల తనిఖీలు చేయడం జరుగుతుందని ఎస్సై వెంకట్ సురేష్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 50 వేల రూపాయలు జరిమానా :- బుధవారం నాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఐదు మందిపై కేసు నమోదు చేసి సాలూరు కోర్టుకి తరలించామని ఎస్సై వెంకట సురేష్ తెలిపారు. జడ్జి ఒక్కొక్కరికి 10000 రూపాయలు చొప్పున జరిమానా విధించారని తెలిపారు. మరలా త్రాగి వాహనం నడిపి దొరికిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష వేస్తామని ఆమె హెచ్చరించారు. అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.