మన న్యూస్ పాచిపెంట,జూలై 30:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దేశానికి వెన్నెముక రైతన్న ఆ రైతన్న కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రకరకాల సంక్షేమ పథకాలు యాంత్రీకరణ పద్ధతులు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ అన్నారు.బుధవారం నాడు మండలం కొత్తవలస గ్రామం రైతు భరోసా కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు. పై కార్యక్రమం వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు అధ్యక్షత వహించారు. సమావేశానికి హాజరైన రైతులకు అధికారులకు వ్యవసాయ శాఖలో కొంతమంది నవధాన్యలుతో తయారు చేసిన పిండి వంటలు పంచిపెట్టారు. ఇటువంటి పదార్థాలు తినడం వలన ఆ ప్రజలు ఆరోగ్యం అంతగా ఉంటారని, అందరూ నవధాన్యాలు సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారి తిరుపతిరావు కోరారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖీ సూర్యనారాయణ మాట్లాడుతూ రైతన్న కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్కువ మదపుతో ఎక్కువ లాభం రావాలనే సదుద్దేశంతో కూలీలు శ్రమ తగ్గించడానికి డ్రోన్లు సహాయం తీసుకుని రైతులు పంటలు పండించవచ్చని తెలియజేశారు. సుమారు పది లక్షల రూపాయల విలువ చేసిన డ్రోన్ మాతమూరు గ్రామ రైతుకు ఐదు లక్షలరూపాయలు కు సబ్సిడీ తో మంజూరు చేశారు. బుధవారం నాడు ఆ రైతు తన పొలంలో అధికారులు సమక్షంలో పత్తి పంటకు పురుగులు మందు స్ప్రే చేశారు. ఒకసారి డ్రోను 10 లీటర్లు మందును స్ప్రే చేస్తుందని ఏడు నిమిషాల్లో ఎకరా పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. రైతులు రసాయనికి ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని కోరారు. జిల్లాలో ఎరువులు కొరత లేదని వెల్లడించారు. ఈ డ్రోన్లు వ్యవసాయము ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాలూరు వ్యవసాయ శాఖ ఏడి సత్యవతి మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని విత్తనాలు ఎరువులు పురుగులు మందులు యంత్రాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. అన్ని పంటలుకు అనుకూలంగా డ్రోన్లు తయారు చేయడం జరిగిందని తెలిపారు. నానో ఎరువులు వాడకంపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారి తిరుపతిరావు మాట్లాడుతూ పండించిన పంటలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. పండించిన పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. రాగులు కొర్రలు తదితర చిరుధాన్యాలు పై రైతులు దృష్టి సారించి సాగు విస్తీర్ణం పెంచాలని కోరారు. పై కార్యక్రమాన్ని పెద్ద గెడ్డ రిజర్వాయర్ నీటి సంఘం డైరెక్టర్ మతల బలరాం,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,పాంచాలి సర్పంచ్ యుగంధర్ విజయవంతంగా నడిపించారు.పాచిపెంట ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు,పార్టీ ఉపాధ్యక్షులు పోలినాయుడు, యూత్ అధ్యక్షులు చల్లా కనక బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పి నర్సింగరావు, మోసూరు త్రీ మాన్ కమిటీ చైర్మన్ సింహాచలం, రైతు ఎం తులసిరావు,మాదిరెడ్డి మజ్జరావు, పలువురు అధికార సిబ్బంది, రాజకీయ నాయకులు రైతులు హాజరయ్యారు.