గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం… కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పటై ఉన్న అపెక్స్ పరిశ్రమలో బుధవారం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జెడ్జి బివి.సులోచన రాణి, మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి గీతా కుమారి, ఎస్సై సురేష్ బాబు, ప్యానల్ అడ్వకేట్స్ అరవ పార్వతయ్య, మహబూబ్ బాషా, అపెక్స్ పరిశ్రమ హెచ్.ఆర్ మేనేజర్లు శైలజ, షరీఫ్, పి.ఆర్.ఓ మోహన్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.