మృతుడు షేక్ ఫారుక్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన తెలుగుదేశం మండల నాయకులు..!
వింజమూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో విద్యుత్ షాక్ తో మృతి చెందిన షేక్ ఫారుక్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండదండలు లభించాయి. వివరాల్లోనికి వెళ్తే వింజమూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన, షేక్ ఖాదర్ బాషా, వహీదా దంపతుల కుమారుడు షేక్ పారుక్ మంగళవారం ఇంటి వద్దనే విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. టిడిపి కుటుంబ సభ్యుడైనందున ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మండల నాయకత్వానికి కుటుంబాన్ని పరామర్శించాలని వారికి అండగా నిలవాలని ఆదేశాలు ఇచ్చారు. మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు మృతుని కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్థివదేహానికి నివాళులర్పించారు. తెలుగుదేశం సభ్యత్వం ఉన్నందున, ఇన్సూరెన్స్ అందించేందుకు తగిన ఏర్పాట్లను చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని , ధైర్యంగా ఉండాలని నాయకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, ఎస్ కే ఖాజావలి, పాములపాటి మాల్యాద్రి, ఉపాధ్యక్షులు ఆనంద రమణయ్య, కోడూరు నాగిరెడ్డి, చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, చల్లా శ్రీనివాసులు యాదవ్, చావా మహేంద్ర, మహేష్, శ్రీనివాసులు రెడ్డి, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.