మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి మరియు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటకాలలో సాగు చేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు చేయించుకోవలసినదిగా తెలియజేశారు. జొన్న మరియు నువ్వు పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంటల భీమా చేయించుకోవలసినదిగా తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ జహీర్, గ్రామ వ్యవసాయ సహాయకురాలు జి. లక్ష్మి సత్యసాయి గ్రామ నాయకులు మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.