శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- పంట బీమా పథకంతో రైతులకు లాభం అని మండల వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు.అన్నవరం,మండపం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమoలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి సాగు చేస్తున్న బ్యాంకులో రుణం లేని రైతులు పంట బీమా పథకంలో భాగంగా ఎకరాకు 760 రూపాయలు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు.పంట నమోదు,వరి సాగులో పొటాష్ ఎరువు ప్రాధాన్యత, పొలం గట్లపై కంది సాగు,నానో యూరియా,నానో డి ఏ పి,ప్రకృతి వ్యవసాయ పద్ధతులు,80 శాతం రాయితీపై డ్రోన్లు,ఉద్యాన పంటల యాజమాన్యం వంటి అంశాలపై రైతులకు సూచనలు ఇచ్చారు.అనంతరం వరి నారుమడులు,ప్రత్తి పంటను రైతులతో పరిశీలించి సూచనలు ఇచ్చారు.రైతులకు రాయితీపై రాగి విత్తనాలు అందజేసి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ ఓ,సెక్రటరీ,ఎం. పి టీ సి,ఉద్యాన సహాయకుడు సురేష్,రైతులు,మహిళలు పాల్గొన్నారు.