శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామంలో ఏసు ప్రభువు ప్రార్థన మందిరం పాస్టర్ జాన్ దాస్ ఆధ్వర్యంలో కత్తిపూడి పద్మావతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంటి వైద్యులు కొంగు రమేష్ మాట్లాడుతూ, కంటి వైద్య శిబిరానికి గ్రామంలో గల 100 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, వారిలో కంటి ఆపరేషన్లు కొరకు 20 మందిని గుర్తించి త్వరలో కాకినాడ వాసన్ కంటి ఆసుపత్రి లో ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుందన్నారు. అనంతరం కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కత్తిపూడి జార్జి చిన్నపిల్లల ఆసుపత్రి పక్కన పద్మావతి కంటి ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. తక్కువ ధరలకే పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు చేయబడునని తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరంలో వైద్యులు ఎస్. రాజు, గునపర్తి సునీల్ కుమార్, కె .నాగేంద్ర, బత్తిన తాతాజీ, మరియు చర్చ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.