పాలసముద్రం మండలం మన న్యూస్:- సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో ప్రభుత్వ విప్. జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం. థామస్ సూచనలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 పథకంలో భాగంగా బంగారు కుటుం బాలను దత్తత తీసుకునేందుకు పాలసముద్రం మండలం పరిధిలో ఉన్న ప్రముఖులు ముందుకు రావాలని మండల టీడీపీ ప్రధానకార్యదర్శి శేఖర్ రాజు కోరారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతి నిధులు, కౌన్సిలర్లు, ప్రైవేట్ హాస్పిటల్స్, పెట్రోల్బంకుల యజమానులు, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం, భూస్వాములు, మండల సాయి అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్జీఓ సంఘాలు ఇలాంటివారు ముందుకు రావాలని పేదరికంలో ఉన్న కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి సాయం అందించాలని ఆయన కోరారు.