పాలసముద్రం మండలం మన న్యూస్:- పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్నారై పురుషోత్తం యాదవ్ తమ గ్రామంలో స్థానిక రోడ్డులు, సీసీ రోడ్లు, కాలువలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కార్వేటినగరంలో అర్జీ ద్వారా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ కు ఎన్నారై పురుషోత్తం యాదవ్ వినతి పత్రం ఇచ్చి తమ గ్రామ సమస్యను విన్నవిచ్చుకున్నారు.దీనిపై ఎమ్మెల్యే స్పందించి త్వరలోనే మీ గ్రామానికి పర్యటన వస్తానని సమస్యలపై సంబంధించిన అధికారులకు తెలియజేసి సమస్యలకు పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు ఎన్నారై పురుషోత్తం యాదవ్ తెలిపారు.