మన న్యూస్ పాచిపెంట జూలై 29 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఉన్న మోడల్ పాఠశాలను మంగళవారం క్లస్టర్ హెచ్ఎం సందర్శించారు. పాఠశాలకు వెళ్లిన ఆయన ముందుగా ఈరోజు హాజరైన ఉపాధ్యాయుల అటెండెన్స్ పుస్తకాలను తనిఖీ చేశారు. అదేవిధంగా పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని వారి హజరు పట్టికను చూశారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వ్రాత పుస్తకాలతో పాటు హోం వర్క్ పుస్తకాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయో లేదోనని ఆరా తీశారు. అదే విధంగా ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాలు పరిశీలించడమే కాకుండా, రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవగతమైన పాఠ్యపుస్తకాలలో ఉన్న పాఠాలను ఉపాధ్యాయులు బోధించే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు.