మన న్యూస్ సాలూరు జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లో మున్సిపాలిటీలోని 12, 13, 15, 16, 17 వార్డులలో ఘనంగా నిర్వహించబడింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని, ప్రజల మద్ధతుతో ముందుకు సాగుతున్న చంద్రన్న పాలన విశేషాలను వివరిస్తూ నడిచారు. మంత్రి సంధ్యారాణిని మేళతాళాలు, పసుపు కుంకుమలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. “మా సంధ్యమ్మను గెలిపించుకున్నాం… చంద్రన్న పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఊపందుకుంటుంది” అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి అర్హునికి సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా అభిప్రాయాలు వెల్లడించగా, మంత్రి ఆ వివరాలను ఓపికతో విన్నారు. ప్రజల ఇంటికే వెళ్లి వారి సమస్యలు స్వయంగా వినడం ద్వారా ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న సానుభూతి మరియు సమర్పణ భావాన్ని చాటిందని ఆమె తెలిపారు. సాలూరు పట్టణాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రివర్యులు హామీ ఇచ్చారు. ప్రజల్లో నమ్మకం తిరిగి పెరిగిందని, చంద్రన్న పాలనపై విశ్వాసంతో ప్రజలు టీడీపీపై ఆశగా చూస్తున్నారని ఆమె అన్నారు..ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.