వరికుంటపాడు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
వరికుంటపాడు మండలం జడ దేవి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వరికుంటపాడు మండలం నాయకత్వంలో, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జిలా సారథ్యంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. భారీ జన సందోహం నడుమ ఎమ్మెల్యే ప్రతి గడపకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ను వివరించారు. గత వైసిపి పాలనకు నేటి చంద్రన్న పాలనకు వ్యత్యాసాన్ని వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్టర్ రద్దు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత ఇసుక పాలసీ, అమలు చేస్తున్నామన్నారు. త్వరలో మిగిలిన పథకాలను కూడా అమలు పరుస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు పరుస్తూనే, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కనుక ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని తెలిపారు.
గ్రామంలోనికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి మండలం మరియు గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు. స్థానికులు వ్యక్తిగత సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటికి పరిష్కార మార్గాలను చూపారు.
ఈ కార్యక్రమంలో, మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు, చండ్ర వెంకయ్య, క్లస్టర్ ఇంచార్జ్ పోకా మహేష్, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, మండల తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల వైస్ ఎంపీపీ దేవనబోయిన మధు, యూనిట్ ఇంచార్జ్ గుర్రం గోపి, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ ఆవుల అరుణమ్మ, ఆండ్రా బాల గురువారెడ్డి, కామేపల్లి వెంకటరత్నం, గొడుగులూరు మాలకొండ రాయుడు, నూనె ప్రసాద్, పొద మాధవరావు, మూలే వీరారెడ్డి,అరికొండ వెంకటరత్నం, కామేపల్లి శ్రీనివాసులు, సంధిరెడ్డి మాలకొండయ్య, టిడిపి నాయకుల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.