గూడూరు, మన న్యూస్ :- ఏఐ (కృత్రిమ మేధ)పై 60 రోజులు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ పోగ్రాంలో గూడూరు కి చెందిన సుధా చంద్రమౌళి టాపర్ గా నిలిచారు. హైదరాబాద్ టి హబ్ లో జరిగిన పట్టాలు ప్రదానోత్సవంలో ఏఐ పట్టా అందుకున్నట్లు సుధా చంద్రమౌళి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సుధా చంద్రమౌళి మాట్లాడుతూ ఏఐ ఎక్స్ పర్ట్ సర్టిఫికెట్ అందుకోవడం సంతోషం గా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఏఐ టెక్నాలజీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని , భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని కోరారు. త్వరలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో ఏఐ తరగతులు జరిగేలా కృషి చేస్తామనన్నారు.