గూడూరు, మన న్యూస్ :- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 17వ రోజు లో భాగంగా…నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీ ST కాలనీ నందు 5.00 లక్షలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించి…ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని, సూపరిపాలన పాంప్లెట్ అందించి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న…..గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ .మాట్లాడుతూ పంచాయతీ నందు 31.60 లక్షల రూపాయలతో 3 CC రోడ్లు వేశాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద 25 లక్షల చెరువు పనులు చేస్తున్నాము. ముఖ్యమంత్రి సహాయానిది కింద ముగ్గరికి 3.45 లక్షలు అందించాము. 1 కోటి 14 లక్షల రూపాయలతో RWS పనులు చేశామన్నారు. గత ప్రభుత్వం లాగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు మాది, చెప్పిన మాట ప్రకారం మా నాయకుడు పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టే మేము ఈ రోజు ఇలా గడప గడప తురుగుతున్నాం అని అన్నారు. మీరు తిరగగలిగారా మీ హయాంలో అని అన్నారు. ఎందుకంటే మీరు చేసింది ఏమి లేదు కాబట్రి తిరిగే ధైర్యం లేదు మీకు అని అన్నారు. కాబట్టి ప్రెస్ మీట్ లో ఏవేవో మాటలు మాటడొద్దు అని అన్నారు. మీలా తప్పించుకుని తిరిగే ప్రభుత్వం కాదు మాది, నిరంతరం ప్రజల మధ్య ఉండమని చెప్పే నాయకుని ఆధ్వర్యంలో చేస్తున్నాం అని అన్నారు.