గూడూరు, మన న్యూస్ :- జమ్మూ కాశ్మీర్ లో ఏప్రిల్ 22న పెహల్గాం లో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇదివరకే ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. సోమవారం పెహల్గామ్ లో పర్యాటకులను చంపిన ఉగ్రవాదుల్లో ముఖ్య సూత్రధారి అయిన సులేమాన్ షాను భారత్ సైన్యం ఆపరేషన్ మహదేవ్ శ్రీనగర్ సమీపంలోని డచ్చిగామ్ అడవుల్లో ఉన్న మహదేవ్ పర్వతం సమీపంలో ముష్కరులు దాడులకు శిక్షణ పొందుతున్నట్లు కొన్ని అనుమానించదగ్గ రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్స్ ద్వారా మన భద్రతా బలగాలు అప్రమత్తమై హత మార్చారు. మహదేవ్ వద్ద ఉగ్రవాదుల హతమార్పిడిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక టవర్ క్లాక్ సెంటర్ ప్రాంతంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కె. దయాకర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ మహదేవ్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్ 22న పెహల్గాంలో భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్ర మూకలు కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవ్ ద్వారా ఏరిపారేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కే.దయాకర్ మాట్లాడుతూ పెహల్గాంలో అమాయకులైన భారత టూరిస్టులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలను ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవ్ ద్వారా ఏరి పారేస్తున్న ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ, హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ భారతదేశ రక్షణకు ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజాసింగ్ ఆధ్వర్యంలో సైనికులు చేసిన పోరాటానికి సెల్యూట్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ నాయుడు,మహిళా నాయకురాలు బిందు రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం.రవీంద్ర,బాలకృష్ణ గౌడ్,కోశాధికారి నిరంజన్, పట్టణ ఉపాధ్యక్షులు ఐ సురేష్ బాబు,గుమ్మడి శ్రీనివాసులు, బల్లి ప్రభాకర్,ఓబీసీ మోర్చా నాయకులు కటికాల సురేష్ బాబు,యువ మోర్చానాయకులు శివకుమార్,మధిర సునీల్ కుమార్, కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.