గూడూరు, మన న్యూస్ :- వివిధ రంగాల్లో తమ ప్రత్యేకమైన పరిశోధనల ద్వారా డాక్టరేట్ (Ph.D.) డిగ్రీలతో గౌరవించబడిన గౌరవనీయ అధ్యాపకులను అభినందించడంలో ఆదిశంకర ( deemed టూ బి యూనివర్సిటీ ) గర్వంగా భావిస్తోంది. శ్రీ చీపినేటి సురేశ్ , ప్రొఫెసర్ & విభాగాధ్యక్షులు, గణితశాస్త్ర విభాగం, రాయలసీమ యూనివర్సిటీ నుండి డా. పి.ఎం.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో డాక్టరేట్ పొందారు. వారి పరిశోధన శీర్షిక: “Magnetohydrodynamic Convective Heat Transfer Flow through Porous Medium with Heat Sources.”శ్రీ వరదగల జగదీష్ , అసోసియేట్ ప్రొఫెసర్, గణితశాస్త్ర విభాగం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి ప్రొఫెసర్ ఎస్. శ్రీనాధ్ మార్గదర్శకత్వంలో డాక్టరేట్ పొందారు. వారి పరిశోధన శీర్షిక "Transport Phenomena in Conducting Peristaltic Non-Newtonian Fluid Flows through Flexible Channels.శ్రీ అమరేంద్ర జడ్డా , అసోసియేట్ ప్రొఫెసర్ & విభాగాధ్యక్షులు, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (JNTUK) నుండి డా. ఐ. శాంతి ప్రభ , రిటైర్డ్ ప్రొఫెసర్, JNTUK గారి మార్గదర్శకత్వంలో డాక్టరేట్ పొందారు. వారి పరిశోధన శీర్షిక: “Optimised Fuzzy Wavelet Neural Network with Adaptive Wiener Filtering for Improved Speech Enhancement.”
ఆదిశంకర( Deemed to be University ) Chancellor Dr Vanki Penchalaiah garu , ప్రిన్సిపాల్ Dr M Rajaiah మరియు ఫ్యాకల్టీ సభ్యులు వారి అకాడెమిక్ కృషి మరియు పరిశోధనల్లో వారు చేసిన అసాధారణమైన ప్రయత్నాలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. వారి ప్రొఫెషనల్ మరియు పరిశోధనా జీవితంలో ఇంకా ఎక్కువ విజయాలు సాధించాలని సంస్థ ఆకాంక్షిస్తుంది.