మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పై ఆరోపణలు చేస్తే సహించేదిలేదాని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రాం రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మా రెడ్డి కృష్ణారెడ్డి లు విలేకరులతో మాట్లాడుతూ..
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తన కార్యకర్తలను కాపాడుకునేందుకే కొత్త డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తన కార్యకర్తలను కాపాడుకునేందుకే కొత్త డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు.15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్ షిండే నియోజకవర్గంలో ఏ ఒక్క భారీ పథకాన్ని తీసుకురాలేకపోయారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఏడాదిలోనే గ్రామాలకు బీటీ రోడ్లు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల, పిట్లం, బిచ్కుందతో పాటు పలు మండలాలకు సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చారన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విధంగా జుక్కల్ నియోజకవర్గం లో రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేసిన ఘనత తోట లక్ష్యం కాంతారావుకు దక్కిందన్నారు.ఇంత అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాల్లో హస్గుల్, పుల్కల్,ఖత్ గావ్,కుర్లా, గుండె నెమిలి, నుంచి మంజీరా నదిని కొల్లగొట్టి కోట్ల రూపాయలు సంపాదించుకుంది మీరు కాద అని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పిట్లం మండలాధ్యక్షుడు హన్మాండ్లు, నిజాంసాగర్,మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు మల్లిఖార్జున్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.