గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని డి ఆర్ డబ్ల్యు మహిళా కళాశాలలో రోటరీ క్లబ్, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా క్లబ్ సభ్యులు విద్యార్థినిలు మొక్కలను నాటారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రోటరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని చెట్లు తగ్గిపోతూ ఉన్నాయని కొన్ని సంవత్సరాలకి మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి ,దశరథ రామిరెడ్డి, ముని గిరీష్ ,మల్లు విజయ్ కుమార్ రెడ్డి ,శ్రీధర్ ,హనుమంతరావు ,గాయత్రి ,ప్రశాంతి, సంధ్య, తదితరులు పాల్గొన్నారు .