గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు, అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు పాలిచెర్ల వారి పాలెం స్కూలుకి స్పోర్ట్స్ కిట్ ను వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ మరియు మస్తాన్ గారి చేతుల మీదుగా స్కూలు ఉపాధ్యాయులు మాధవయ్య గారికి అందజేయడం జరిగింది… రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పాలిచెర్ల వారి పాలెం హైస్కూల్ నందు ఉపాధ్యాయులు గా పనిచేయుచున్న మాధవయ్య వారి స్కూల్ లోని విద్యార్థిని, విద్యార్ధులకు స్పోర్ట్స్ కిట్ కావాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగిందనీ వారు అడిగిన వెంటనే గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిo సునీల్ కుమార్ గారు స్పోర్ట్స్ కిట్ మంజూరు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే గారు విద్యార్థినీ విద్యార్థుల అవసరాలు గుర్తించి వారికి ఆటలాడుకునే దాని కొరకు ఇప్పటివరకు 15 ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చారని తెలిపారు.పాలిచర్ల వారి పాలెం జడ్పీ హైస్కూల్ కూడా స్పోర్ట్స్ కిట్ ఇచ్చినందుకు మాధవయ్య ఎమ్మెల్యే గారికి స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్, కానిస్టేబుల్ మస్తాన్, జి. మాధవయ్య, పి. రమేష్, పిడి దివిపాలెం, తదితరులు పాల్గొన్నారు.