గూడూరు, మన న్యూస్ :- రైతులకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం ఆధునిక యంత్రాలను రైతులకు ఇవ్వడం జరుగుతుందని గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు చేసింది ఏమీ లేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా వచ్చిన డ్రోన్ ను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వం నుండి వచ్చిన డ్రోన్ ను చిల్లకూరు మండలం రైతుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఆధునిక యంత్రాలు ద్వారా వ్యవసాయం చేసుకొని ఆదాయం పొందేందుకు కూటమి ప్రభుత్వం వీటిని అందిస్తుందని పొలంలో మందులను పిచికారి చేసుకునేందుకు డ్రోన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేదని రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు నియోజకవర్గంలో త్వరలో మరికొన్ని డ్రోన్లను అందిస్తామని త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్,భాస్కర్ రెడ్డి,బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులు ,వెంకటేశ్వరరాజు, వినోద్ కుమార్ రెడ్డి ,రాజశేఖర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి,వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు .