గూడూరు, మన న్యూస్ :- గూడూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు
గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 24 మందికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 19లక్షల 66వేల,26 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక కోటి 50 లక్షల రూపాయలు సీఎం సహాయనిధి ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య ,పులిమీ శ్రీనివాసులు,కిషోర్ నాయుడు, భాస్కర్ రెడ్డి ,మట్టం శ్రావణి ,తదితరులు పాల్గొన్నారు .