Nellore, Mana News :- ప్రజాసత్తా వినతి,విజ్ఞప్తిల మేరకు ఎన్నో ఏళ్లుగా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ కు ప్రజాసత్తా వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు ప్రత్యేక లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా పులగర శోభనబాబు జిల్లా కలెక్టర్ ఆనంద్ తో మాట్లాడుతూ ప్రజాసత్తా ఆధ్వర్యంలో ఈఏడాది జనవరి 6 వ తేదిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మీకు వినతి పత్రం ఇచ్చినట్లు గుర్తు చేశారు.ప్రభుత్వానికి పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పులగర పేర్కొన్నారు.ఈకార్యక్రములో ప్రజాసత్తా నాయకులు చింతల దయాకర్,పల్లిపాటి బాలవర్ధి,సింగినం జాలయ్య,చెక్కా రామయ్య, మహిళా నాయకులు పి.పద్మ,పి.సరోజనమ్మ,కె.పార్వతి,సి.నాగమణి తదితరులు పాల్గొన్నారు.