– శంకరమఠానికి చెందిన హనుమంతప్ప ప్రవచనకర్తగా
ఉరవకొండ, మన న్యూస్:
ఉరవకొండ సమీపంలోని గవి మఠ సంస్థానంలో జగద్గురు కరిబసవ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రావణ మాస పురాణ ప్రవచనాలు రేపటినుండి నుండి ప్రారంభమవనున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ మఠ సహాయక కమిషనర్ రాణి తెలిపారు. ఆదివారం జరిగిన పూజా కార్యక్రమాల్లో గవి సిద్ధేశ్వర దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రావణ మాస ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఏసీ రాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "గవి మఠం – 770 మఠాలకు మూలమఠం. జగద్గురు కరిబసవ స్వామి మహిమాన్వితులై ఎన్నో అద్భుతాలు చేశారు." అని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లాలోని విరుపాపురం గ్రామానికి చెందిన శంకరమఠ ప్రవచనకర్త హనుమంతప్ప గారు పురాణ ప్రవచనాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 5 నుంచి 5:30 వరకు స్వామివారికి సుప్రభాత సేవలు, అనంతరం రుద్రాభిషేకం, శతనామావళి, బిల్వార్చనలు, మహామంగళహారతి వంటి పూజా కార్యక్రమాలు భక్తులచే నిర్వహించబడతాయని వెల్లడించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనుండగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై జగద్గురు కరిబసవ స్వామి కృపకు పాత్రులవ్వాలని ఏసీ రాణి ఆకాంక్షించారు.
ఆధ్యాత్మిక చైతన్యం కోరే భక్తులు ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని పిలుపునిచ్చారు.