వైజాగ్, మన న్యూస్ : ఐ.ఎస్.ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యర్యంలో 150 మంది కవుల పట్టాభిషేకం విశాఖ సాగర కవితోత్సవం వైజాగ్ శుభం ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బొబ్బిల్లంక గ్రామానికి చెందిన యువ కవి, విద్యా మరియు సామాజిక సంస్కర్త, ఐటీ సాఫ్టు వేరు శ్రీ నక్కిన ధర్మేష్ అక్షరజ్యోతితో నవ సమాజ నిర్మాణం అనే కవితా శీర్షికతో చక్కటి కవితాగానం చేసి కవుల ప్రశంసలు పొందారు. యువ కవి నక్కిన ధర్మేష్ ను శ్రీ శ్రీ కళా వేదిక సి. ఈ .ఓ . కళారత్న కత్తిమండ ప్రతాప్ , జాతీయ అధ్యక్షరాలు ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి పార్థసారథి చేతుల మీదుగా శాలువ ,పూలదండ, ప్రశంసా పత్రం, జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు.